బీట్‌రూట్ వడ

frame బీట్‌రూట్ వడ

cheruku raja
బీట్‌రూట్ వడ కావాల్సిన పదార్థాలు : బీట్‌రూట్ తురుము : ఒక కప్పు పచ్చి శనగపప్పు : ఒక కప్పు ఉల్లిపాయ :1 పెద్దది నూనె : తగినంత పచ్చిమిరపకాయలు :6 అల్లం తురుము : 1 టీ స్పూను ఉప్పు : తగినంత కొత్తిమీర తరుగు : మూడు టీ స్పూన్లు  తయారుచేసే విధానం : ముందుగా శనగపప్పు రెండు గంటలు నానబెట్టాలి. ఈ నానబెట్టిన పప్పుని నీళ్లు వంపేసి విడిగా తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. రుబ్బిన శనగపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, ఉల్లితరుగు, బీట్‌రూట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడలాగా ఒత్తుకొని వేడి నూనెలో దోరగా వేయించాలి. వేడి.. వేడి బీట్‌రూట్ వడ తయారైనట్లే! వీటికి టమాటో సాస్ మంచి కాంబినేషన్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More